తెలుగు సాహిత్యంలో కవిసార్వభౌమ శ్రీనాథునిపై జాతీయ స్థాయిలో వ్రాసిన ఉత్తమ వ్యాసానికి మణుగూరు మండలంలోని నాయుడుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి కోటేశ్వరరావుకు జాతీయస్థాయి డా. ఎన్టీఆర్ కీర్తి పురస్కారం లభించింది. కీశే॥ డా. నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాలలోని సాంస్కృతిక, సామాజిక, సాహిత్య విద్య, కళారంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సౌజన్యంతో ఫిలింత్రోఫిక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని వి.వి కోటేశ్వరరావు కు ఈనెల 30వ తేది సోమవారం 10 గం||లకు విజయవాడ గాంధీనగర్ లో ఐలాపురం కన్వెన్షన్ సెంటర్ నందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఆంద్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణువర్ధన్ చేతుల మీదుగా స్వర్ణ కంకణం, మత్యాల హారం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలతో సన్మానించ నున్నామని ఫిలింత్రోఫిక్ జాతీయ అధ్యక్షులు అద్దంకి రావా తెలిపారూ ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కోటేశ్వరరావును మండల విద్యాశాఖాధికారి . వీరాస్వామి అభినందించారు.